Janagama | రెవెన్యూ అధికారుల వేధింపులకు రైతు ఆత్మహత్య
Janagama | జనగామ జిల్లాలో రెవెన్యూ అధికారుల వేధింపులకు ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బచ్చన్నపేట మండలం పడమటి కేశవాపురం గ్రామంలో చోటు చేసుకుంది.
Janagama | జనగామ : జనగామ జిల్లాలో రెవెన్యూ అధికారుల వేధింపులకు ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బచ్చన్నపేట మండలం పడమటి కేశవాపురం గ్రామంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. పడమటి కేశావపురం గ్రామానికి చెందిన రైతు రఘుపతి తన ఎకరం భూమి రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. రిజిస్ట్రేషన్ కోసం సీనియర్ అసిస్టెంట్ సుమన్, సర్వేయర్ రవీందర్ కలిసి రూ. 4 లక్షలు వసూళ్లు చేశారు. రైతు రఘుపతి నుంచి రూ. 4 లక్షలు తీసుకొని రెండేండ్లు గడుస్తున్నప్పటికీ రిజిస్ట్రేషన్ చేయలేదు. అప్పుగా డబ్బులు తెచ్చానని, తిరిగి ఇవ్వాలని బాధిత రైతు అధికారులను పలుమార్లు వేడుకున్నాడు. ఇద్దరు అధికారులు డబ్బులు ఇవ్వకుండా వేధింపులకు గురి చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రైతు రఘుపతి తన వ్యవసాయ పొలం వద్ద ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రైతు కుటుంబ సభ్యులు డెడ్‌బాడీతో బచ్చన్నపేట ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నాకు దిగారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

