నల్లబెల్లి, మార్చి 31 : దిగుబడులు రాక తీవ్రమనస్తాపం చెందిన ఓ రైతు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో మంగళవారం చోటుచేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని బుచ్చిరెడ్డిపల్లికి చెందిన రైతు బానోత్ సోమ్లా (65) తన వ్యవసాయ భూమిలో మక్కజొన్న పంట వేశాడు. ఆశించినమేర దిగుబడి రాలేదు.
పాతవి, కొత్తవి కలిపి సుమారు రూ.7లక్షలు అయ్యాయి. వీటిని తీర్చేమార్గం లేక మనస్తాపానికి గురయ్యాడు. మంగళవారం పొలానికి వెళ్లి మక్కజొన్న పంటను ఆరబోసి తిరిగి ఇంటికి వస్తుండగా మార్గమధ్యంలో ఛాతిలో నొప్పి రావడంతో గ్రామ పొలిమేరలోనే కుప్పకూలిపోయాడు. గమనించిన పలువురు అతడిని దవాఖానకు తరలించేలోపే మృతి చెందాడు. సోమ్లాకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు.