అప్పుల బాధతో రైతు ఆత్మహత్య.. మహబూబ్నగర్లో విషాదం
అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటుచేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. దేవరకద్ర మండలం గోపన్పల్లికి చెందిన వనం వెంకటేశ్ (35) తనకున్న ఎకరా పొలంతోపాటు మరో నాలుగెకరాలు కౌలుకు తీసుకొని పత్తి, వేరుశనగా సాగు చేశాడు.
- దిగుబడులు రాక మనస్తాపం
దేవరకద్ర, జనవరి 31 : అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటుచేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. దేవరకద్ర మండలం గోపన్పల్లికి చెందిన వనం వెంకటేశ్ (35) తనకున్న ఎకరా పొలంతోపాటు మరో నాలుగెకరాలు కౌలుకు తీసుకొని పత్తి, వేరుశనగా సాగు చేశాడు. ఈ సారి పంట దిగుబడులు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో.. పెట్టుబడులు, కుటుంబం పోషణ కోసం చేసిన అప్పులు పెరిగిపోవడంతో మనస్తాపం చెందాడు.
ఈ క్రమంలో ఉన్న ఎకరా పొలాన్ని విక్రయించి అప్పులు తీర్చాలని నిర్ణయించుకున్నాడు. పొలం అమ్మకూడదని అతని మామ నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. అప్పటికే మానసికంగా కుంగిపోయిన వెంకటేశ్ శనివారం ఉదయం పొలం వద్దకు వెళ్లిన అక్కడ ఉన్న పశువుల కొట్టంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మధ్యాహ్నం వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లి చూడగా విగతజీవిగా కనిపించాడు. పొలం అమ్మకూడదని మందలించినందుకే అల్లుడు ఆత్మహత్య చేసుకున్నాడంటూ అతని మామ మొగిలన్న ఆత్మహత్యకు యత్నించాడు. కాగా అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు తెలిసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Balmuri Venkat | భూవివాదంలో ఎమ్మెల్సీ బల్మూరి.. ప్రైవేట్ ట్రస్ట్ భూమి కబ్జాకు యత్నం!
Jupally Krishna Rao | మంత్రి జూపల్లి బాత్రూం రిపేర్కు రూ. కోటి.. అప్పు పుట్టడం లేదంటూనే సర్కార్ దుబారా !
Medicover | కిడ్నీ చికిత్సకు పోతే కాటికి పంపిండ్రు.. మెడికవర్లో న్యాయవాది మృతి!
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలిని, రోహిత్లకు షాక్.. ఈ వారం నామినేషన్లలో ఆ ఆరుగురు!
Singareni Profits | సింగరేణి లాభాలు ఢమాల్.. ఏడాదిలోనే రూ.4,640 కోట్లు డౌన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

