హైదరాబాద్ : శబరిమలై వెళ్లి తిరిగి వస్తూ రోడ్డు ప్రమాదం(Road accident)లో తీవ్రంగా గాయపడి మదురై దవాఖానలో చికిత్స పొందుతున్న ములుగు(Mulugu) జిల్లా మంగపేట మండలం కమలాపురానికి చెందిన జరుపుల రాము (24) బుధవారం మృతి చెందాడు. కాగా, తమిళనాడు రాష్ట్రం మదురైలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ములుగు జిల్లాకు చెందిన ముగ్గురు అయ్యప్ప భక్తులు(Ayyappa devotees) మృతి చెందారు.
శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లి వస్తుండగా తిరిగి వస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. మదురై ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందిన ముగ్గురు అయ్యప్ప దీక్షాపరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను దగ్గరలో ఉన్న దవాఖనకు తరలించారు. శబరిమల నుంచి తిరిగి వస్తున్న క్రమంలో మద్రాస్ బైపాస్ రోడ్డులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.