హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): ఆస్ట్రేలియా పార్లమెంట్, కౌన్సిల్ సభ్యుల బృందం ఈ నెల 15న రాష్ట్రంలో పర్యటించనున్నది. ఆస్ట్రేలియా నేషనల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఉల్ఫ్గంగ్ సొబోట్క నేతృత్వంలోని 19 మంది సభ్యుల బృందం మంగళవారం శాసనసభను పరిశీలించనున్నది. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డితో సమావేశమై సభ నిర్వహణ వ్యవహారాలను అధ్యయనం చేస్తుంది. అనంతరం అక్కడి చౌమొహల్లా ప్యాలెస్, చార్మినార్ మొదలైన చారిత్రక ప్రాంతాల్లో పర్యటిస్తుంది. ఆ తర్వాత బృందానికి తాజ్‌కృష్ణలో స్పీకర్ మర్యాదపూర్వక విందు ఇస్తారు.