Kamareddy | బీర్కూర్ : ‘ మా నాన్న రోజు తాగొచ్చి అమ్మను కొడుతున్నాడు’ అంటూ ఓ చిన్నారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. చిన్నారి ఆవేదనను అర్థం చేసుకున్న పోలీసులు తక్షణమే తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు.
ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రానికి చెందిన లతీఫ్, ఇర్ఫానా అనే దంపతులు తమ కుమార్తె ఫాతిమాతో కలిసి ఉంటున్నారు. అయితే లతీఫ్ మద్యానికి బానిసగా మారాడు. నిత్యం మద్యం సేవించి వచ్చి ఇర్ఫానాను హింసిస్తూ, కొడుతున్నాడు. దీంతో ఫాతిమా తన తల్లిని నాన్న కొడుతున్నాడంటూ బీర్కూర్ పోలీసు స్టేషన్‌కు నేరుగా వెళ్లి ఫిర్యాదు చేసింది.
పోలీసులు బాలిక నుంచి అన్ని వివరాలను సేకరించారు. వెంటనే ఇర్ఫానా, లతీఫ్ దంపతులను పోలీస్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. మరోసారి తాగి ఇలాంటి పనులు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ బాల్‌రెడ్డి లతీఫ్‌ను హెచ్చరించారు. బాలిక ధైర్యాన్ని పోలీసులు మెచ్చుకున్నారు.