Congress Leaders | కాంగ్రెస్ అంటేనే గ్రూప్ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గల్లీ అయినా.. ఢిల్లీ అయినా కుర్చీల కోసం, ఫ్లెక్సీల కోసం పంచాయతీ పెట్టుకోవాల్సిందే. తాజాగా కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్గపోరు బయటపడ్డది. కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీలో ఫ్లెక్సీల గొడవ రాజుకుంది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి కూకట్ పల్లి వై జంక్షన్ వద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే స్థానిక నాయకుల ఫోటోలను పెట్టకుండా, శేరి సతీష్ రెడ్డి ఫోటోతో అనుచరులు ఫ్లెక్సీలు పెట్టడంతో వివాదం చెలరేగింది.
కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరించిన తర్వాత కూడా శేరి సతీష్ రెడ్డి ఫ్లెక్సీలు ఎలా పెడతారంటూ ఓ వర్గం గొడవకు దిగింది. ఈ క్రమంలో ఫ్లెక్సీలు కాంగ్రెస్ నేతలు చింపి వేయగా.. ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. వెంటనే రంగంలోకి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఫ్లెక్సీలను చింపేసిన కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీలో ఫ్లెక్సీల గొడవ
కూకట్ పల్లి వై జంక్షన్ వద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి
స్థానిక నాయకుల ఫోటోలను పెట్టకుండా, శేరి సతీష్ రెడ్డి ఫోటోతో ఫ్లెక్సీలు పెట్టిన అనుచరులు
కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరించిన తర్వాత… pic.twitter.com/nwgbVAoM1O
— Telugu Scribe (@TeluguScribe) September 6, 2026
Bittu Tabahi | నదిని శుభ్రం చేసిన యువకుడు.. బిట్టు తబాహికి పద్మ ఇవ్వాలన్న సింగర్ చిన్మయి!
న్యూడ్ ఫొటోలతో కాంగ్రెస్ నాయకుడి బెదిరింపులు.. సూర్యాపేటలో మహిళ ఆత్మహత్యాయత్నం
Bigg Boss | బిగ్ బాస్ హౌజ్లోకి వెళ్లకుండానే ఎలిమినేషన్.. క్రిటిక్కి షాకిచ్చిన ఆడియన్స్!