సిరికొండ ( నిజామాబాద్ ) : కాంగ్రెస్ పాలన ( Congress rule ) లో తెలంగాణ రాష్ట్రం మరోసారి ధ్వంసమైందని నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ ( BRS ) నాయకుడు, మాజీ జడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డి జగన్ ( Bajireddy Jagan ) ఆరోపించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) ఆదేశాల మేరకు ఆరు రోజుల ఆందోళన కార్యక్రమంలో భాగంగా ఆదివారం జిల్లాలోని సిరికొండ మండలంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో గ్రామాలను ఎంతో అభివృద్ధి పథంలో నడిపించారని, గ్రామానికి స్మశానవాటికలు, పల్లె ప్రగతి వనాలు, 24 గంటల కరెంటు, డంపింగ్ యార్డులు , హరితహారం ఇలాంటి అభివృద్ధి పనులు ఎన్నో చేశారని పేర్కొన్నారు. వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ధ్వంసం అయ్యాయని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో పల్లెల్లో అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీ కార్డులను ప్రజలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు నారబోయిన శ్రీనివాస్, నాయకులు బుక రాజు, క్యాతం శివారెడ్డి,నాగపురం రాజేందర్, చిగురు శ్రీనివాస్, ఇట్టేడి అజయ్, గుర్రం శ్రీధర్, బొల్లం గోపాల్, ప్రభాకర్, సంపత్, నరేష్, మహేందర్, జీవన్, మల్లేష్,చందు, గడ్కోల్ బీఆర్ఎస్ నాయకులు భూషణ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.