The Paradise | నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ది పారడైజ్’ విడుదల తేదీపై ఫిలింనగర్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి.
మొదట ఈ సినిమాను సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని భావించినప్పటికీ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు మరియు వీఎఫ్ఎక్స్ వర్క్స్ కారణంగా ఈ మూవీ రిలీజ్ మరోసారి వాయిదా పడనుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. సెప్టెంబర్ 24 నుంచి ఈ చిత్రాన్ని వెనక్కి జరిపి అక్టోబర్ 9వ తేదీకి విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ఫిలిం సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ వాయిదా వార్తలపై చిత్ర నిర్మాణ సంస్థ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక స్పష్టత రాలేదు. త్వరలోనే దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.