AP News | అప్పు తీర్చలేదని తల్లిని, 6 నెలల పసికందును లాక్కెళ్లిన వడ్డీ వ్యాపారులు
AP News | ఏపీలో దారుణం జరిగింది. తీసుకున్న అప్పును తిరిగి చెల్లించడంలేదని వడ్డీవ్యాపారులు తల్లిని, పసికందును లాక్కెళ్లిన ఘటన కలకలం సృష్టిస్తోంది.
అమరావతి : ఏపీలో దారుణం జరిగింది. తీసుకున్న అప్పును తిరిగి చెల్లించడంలేదని వడ్డీవ్యాపారులు ( Moneylenders ) తల్లిని, పసికందును లాక్కెళ్లిన ఘటన కలకలం సృష్టిస్తోంది. తిరుపతి ( Tirupati ) జిల్లా తొట్టంబేడు మండలం శివనాథపాలెంలో నివాసం ఉంటున్న ఆది, మేఘమాల దంపతులు అవసరం నిమిత్తం శ్రీకాళహస్తికి చెందిన వెంకటగిరి మునెమ్మ, ప్రసాద్, మోహన్ కుటుంబ సభ్యుల వద్ద ఏడు నెలల క్రితం 5 రూపాయల వడ్డీకి రూ.1,50,000 అప్పుగా తీసుకున్నారు.
అప్పు చెల్లించలేదని భర్తలేని సమయంలో ఇంట్లోకి వెళ్లి భార్య మేఘమాలపై దాడి చేసి, ఆమెతో పాటు 6 నెలల పసికందును జీపులో ఎత్తుకెళ్లారు . బాధితురాలు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పసిపాపను తిరిగి తల్లిదండ్రులకు పోలీసులు అప్పగించారు. తాము తీసుకున్న అప్పును తిరిగి చెల్లిస్తామని చెప్పినా కూడా దౌర్జన్యంగా తమను తీసుకెళ్లి బంధించారని బాధితురాలు వాపోయారు. వడ్డీ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
అప్పు తీర్చలేదని 6 నెలల పసికందును లాక్కెళ్లిన వడ్డీ వ్యాపారులు
తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం శివనాథపాలెంలో నివాసం ఉంటూ, శ్రీకాళహస్తికి చెందిన వెంకటగిరి మునెమ్మ, ప్రసాద్, మోహన్ కుటుంబ సభ్యుల వద్ద ఏడు నెలల క్రితం 5 రూపాయల వడ్డీకి రూ.1,50,000 అప్పుగా తీసుకున్న ఆది, మేఘమాల దంపతులు
అప్పు చెల్లించలేదని ఆది, మేఘమాల దంపతుల 6 నెలల పసికందును ఎత్తుకెళ్లిన వడ్డీ వ్యాపారులు
బాధితులు ఫిర్యాదు చేయడంతో పసిపాపను తిరిగి తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు
— Telugu Scribe (@TeluguScribe) November 14, 2026
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | అప్పు తీర్చలేదని తల్లిని, 6 నెలల పసికందును లాక్కెళ్లిన వడ్డీ వ్యాపారులు
‘సింగరేణి సమస్యల పరిష్కారానికి ఏఐటీయూసీ రిలే నిరాహార దీక్షలు’
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Ponds Auction | రేవంత్ రెడ్డి ఇలాఖాలో సాగు నీటి కోసం చెరువుల, బావుల వేలంపాట.. వీడియో
Rahul Gandhi | పదేళ్లుగా ఫాసిస్టుల గొంతు గట్టిగా వినిపిస్తోంది.. భారత్ సమిట్‌లో రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

