బయ్యారం : విధి నిర్వహణలో విద్యుత్ మరమ్మతులు చేస్తుండగా కాంట్రాక్ట్ విద్యుత్ ఉద్యోగి కరెంట్ షాక్(Electric shock) తగిలి మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్(Mahabubabad) జిల్లా బయ్యారం మండలం కోటగడ్డ గ్రామానికి చెందిన ఊకే వెంకేటశ్వర్లు(42) నామాలపాడు సమీపంలోని ఓ రైతు పొలం వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్ ఫీజులు వేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తగిలి కింద పడి పోయాడు.
హుటాహుటిన మహబూబాద్ ఏరియా హాస్పిటల్కు తరలించగా మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. బయ్యారం మండలం కొత్తపేట సబ్ స్టేషన్ పరిధిలో గత పదేండ్లుగా రమేష్ విధులు నిర్వహిస్తున్నాడు. రమేష్ మృతి చెందడంతో మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.