హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా ఓబీసీల అభివృద్ధికి కచ్చితమైన గణాంకాలు అవసరమని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం తెలిపారు. జనగణనలో కులగణన చేపట్టాల ని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సలహాదారు వీ హనుమంతరావు చేపట్టిన దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. అనంతరం సత్యం మాట్లాడుతూ.. ఓబీసీలకు రాజ్యాంగబద్ధ హకులు, విద్యా, ఉద్యోగ అవకాశాల్లో సముచిత వాటా కల్పించాలంటే కేంద్రం వెంటనే జనగణనలో భాగంగా కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు.
అక్రమ అరెస్టులు తగదు: ఏఐవైఎఫ్
ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యట న నేపథ్యంలో ముందస్తు అరెస్టులు తగదని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర, రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ వలీ ఉల్లా ఖాద్రీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజాస్వామ్య హకుల కోసం పోరాడుతున్న యువజన, ప్రజాసంఘాల నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని, ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకమని పేరొన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుకలను అణచివేయడానికి పోలీస్ వ్యవస్థను ఉపయోగించడం రాష్ట్ర ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి నిదర్శనమని తెలిపారు. హకులను కాపాడాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ఉద్యమాలపై నిర్బంధాలకు పా ల్పడటం ఆందోళనకరమని పేర్కొన్నారు.