హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో(Parliament elections) ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. అక్కడక్కడ చెదురుముదురు సంఘటనలు మినహా సజావుగా కొనసాగు తున్నాయి. కాగా, జగిత్యాల(Jagithyala) జిల్లాలో ఓటు(Vote) వేస్తూ ఓ యువకుడు ఫొటో(Selfie photo) తీసుకున్నాడు. ఈ సంఘటన ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి గ్రామంలోని 8 పోలింగ్ బూత్‌లో చోటు చేసుకుంది. రెడ్డవేని జయరాజ్ అనే వ్యక్తి ఓటు వేస్తూ సెల్ఫీ తీసుకున్నాడు. ఎన్నికల అధికారి ఫిర్యాదు మేరకు పోలీసులు యువకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.