Jagtial | జగిత్యాల : బీఆర్ఎస్ పార్టీ ( BRS Party ) కి చెందిన సీనియర్ నాయకులు బండారి నరేందర్ ( Bandari Narender ) గుండెపోటు( Heart Stroke )తో మృతి చెందారు. జగిత్యాల పట్టణం ( Jagtial Town )లో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ నాయకులు నృత్యాలు చేస్తుండగా అకస్మాత్తుగా నరేందర్ గుండెపోటుకు గురయ్యాడు. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించే లోగా ప్రాణాలు కోల్పోయారు. నరేందర్ భార్య బండారి రజని కౌన్సిలర్‌గా కొనసాగుతున్నారు.
నరేందర్ మృతి చెందారన్న వార్త తెలుసుకున్న ఎమ్మెల్సీ కవిత ( MLC kavitha ).. తన కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. పార్టీ కార్యక్రమం వేదిక వద్ద నరేందర్ భౌతికకాయానికి ఎమ్మెల్సీ కవిత నివాళులర్పించారు. ఆయ. చిత్రపటానికి ఆమె పుష్పాంజలి ఘటించారు. నరేందర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.