Achampet | అచ్చంపేట : బీఆర్ఎస్ పార్టీని వీడిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై ఓ గులాబీ సైనికుడు నిప్పులు చెరిగాడు. బాలరాజు బీఆర్ఎస్ పార్టీని వీడినంత మాత్రానా పార్టీకి వచ్చే నష్టం ఏం లేదని, కేసీఆరే మనకు శ్రీరామరక్ష అని ఆ వృద్ధుడు స్పష్టం చేశాడు. అచ్చంపేటలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో అచ్చంపేట నియోజకవర్గం పరిధిలోని చిట్లంకుంట గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు అందర్నీ ఆలోచింపజేసేలా మాట్లాడాడు.
ఆ వృద్ధుడి మాటల్లోనే.. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన వారి పట్ల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. గత 25 ఏండ్ల నుంచి నీ వెంబడి ఎవరు లేనినాడు.. తెలంగాణ ఉద్యమంలో చిట్లంకుంట నుంచి ముగ్గురు ఉంటే అందులో నేను ఒకడిని. నాడు ఎవడు కొడుతడో.. ఎవడు తిడుతడో తెలియని పరిస్థితి. మమ్మల్ని చూసి పకపక నవ్వినోళ్లు ఎంతో మంది. ఇంత మందిని దాటేసుకుని కేసీఆర్ బాటలో నడిచాం. అచ్చంపేట తాలుకాను కొంత మెరుగుపరిచావు దాన్ని ఎవరూ కాదనలేరు. కానీ ఇవాళ కష్టకాలంలో, కరువుకాలంలో, ఇవాళ పార్టీ అధికారంలో లేనంత మాత్రాన పార్టీని వదిలిపెట్టి పోవడం చాలా బాధాకరం అని ఆ వృద్ధుడు పేర్కొన్నాడు.
ఇవాళ నువ్వు పార్టీని వీడి వెళ్లిపోయినంత మాత్రానా కార్యకర్తలందరూ నీ వెంట వస్తారనుకోవడం పొరపాటు. ఇలాంటి ఉద్దేశాలు ఎవరికైనా ఉంటే ఇప్పుడే పార్టీని వీడండి. కార్యకర్తలు లేకుండా మీ తరం కాదు.. మీ వశం కాదు. ఇవాళ గువ్వల బాలరాజు బీజేపీలోకి పోయినా.. కనీసం 15 ఏండ్లుగా నీకున్న రాజకీయ అనుభవానికి 15 మంది కార్యకర్తలు కూడా జమ కారు ఆ పార్టీకి. బీజేపీలోకి వెళ్లి నీవు ఏం ఉద్దరిస్తవు. ఏం ఉద్ధరించేది లేదు. నీ జీవితాన్ని కరాబ్ చేసుకున్నావ్. అనవసరంగా ఆగం అయ్యావ్ అని నిప్పులు చెరిగాడు.
అలవిగాని హామీలిచ్చి.. వాటిని అమలు చేయలేక, కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావును బద్నాం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాళేశ్వరం అని, మేడిగడ్డ అని, రేస్ కార్ అని ఆరోపణలు చేసి నిరూపించింది ఒక్కటి లేదు. కాంగ్రెస్ రాజ్యం అంటేనే రావాణకాష్టం. కేసీఆర్, కేటీఆర్ మనకు ముఖ్యం. కేసీఆర్ పాలనే శ్రీరామరక్ష. మనకు ఒక్కటే సంసారం.. కాంగ్రెస్, బీజేపోళ్లకు రెండు సంసారాలు.. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోతే మరో 70 ఏండ్లు సర్వనాశనం అయితది రాష్ట్రం.. అది ఖాయం అని పేర్కొంటూ జై తెలంగాణ అని నినదించాడు వృద్ధుడు.
బీజేపీలోకి పోతే కనీసం 15 ఏండ్లకి 15 మంది కార్యకర్తలు కూడా రారు
కష్ట కాలంలో గువ్వల బాలరాజు పార్టీని వదిలి పోవడం చాలా బాధగా ఉంది
నువ్వు పోగానే మీ వెంట మేము కూడా వస్తాము అనుకోవడం పొరపాటు.. కార్యకర్తలు లేకుండా మీ తరం కాదు pic.twitter.com/st7Q2DdbvH
— Telugu Scribe (@TeluguScribe) August 8, 2025