హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇప్పటివరకు 388 ఇందిరమ్మ ఇండ్లకు స్లాబ్‌లు వేయగా, ప్రభుత్వం నుంచి లబ్ధిదారులకు రూ.98.64 కోట్లు విడుదల చేసినట్టు గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. 9,877 ఇండ్లకు పునాదులు పూర్తికాగా, 1,839 ఇండ్ల గోడల నిర్మాణం పూర్తయిందని ఆయన తెలిపారు.
వారంవారం లబ్ధిదారులకు చెల్లింపుల్లో భాగం గా సోమవారం రూ. 22.64 కోట్లు విడుదల చేసిన ఆయన.. ఈ మేరకు ఇండ్ల నిర్మాణ పురోగతి వివరాలు వెల్లడించారు.