హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ) : పోలీసులు ఎంతలా అరికట్టాలని చూస్తున్నప్పటికీ డ్రగ్స్, గంజాయి రవాణా అవుతూనే ఉన్నాయి. ఈ సారి సినిమా లెవల్లో.. ముందు ఇన్నోవా కారు కాన్వాయ్ వెళ్తుండగా.. వెనుక డీసీఎం వాహనంలో భారీగా గంజాయిని సప్లయ్ చేయబోయి అడ్డంగా దొరికిపోయారు. ఈ తనిఖీల్లో రూ.5 కోట్ల విలువైన 935 కిలోల గంజాయి పట్టుబడింది. ఒడిశా, ఏపీ నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తుండగా హైదరాబాద్‌లోని బాటసింగారంలో గంజాయిని పట్టుకుని సీజ్ చేశారు.
డీసీఎం వాహనంలో పండ్ల బాక్స్‌ల మధ్యలో 35 సంచుల్లో 455 గంజాయి ప్యాకెట్లు తరలిస్తుండగా ఖమ్మం, రాచకొండ ఈగల్ బృందాలు హైదరాబాద్‌లో చాకచక్యంగా నిందితులను పట్టుకున్నారు. ఈ ముఠా సారథి పవార్ కుమార్ బాడు, సమాధాన్ బిస్, వినాయక్ పవార్ అరెస్ట్ అయ్యారు. మొత్తం 455 ప్యాకెట్ల గంజాయి, 6 మొబైల్ ఫోన్లు, మూడు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్ ఫైనాన్సింగ్, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్ను ఛేదించిన ఈగల్ టీమ్ పరారీలో ఉన్న సప్లయర్స్ సచిన్ గంగారాం హాన్, వికీ సేథ్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. దేశంలో ఎకడ గంజాయిని పట్టుకున్న వాటి మూలాలు ఏపీ, ఒడిశా వైపే చూపిస్తున్నాయి.