ఖమ్మం, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం ప్రకాశ్‌నగర్ బ్రిడ్జి వద్ద మున్నేరు వాగులో చిక్కుకున్న 9 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఉదయం నుంచి ఆర్తనాదాలు చేసినా రాత్రి 10 గంటల వరకు అధికారులు స్పందించలేదు. వరదలో చిక్కుకున్నా తమను పట్టించుకోవడం లేదని, కనీస సహాయక చర్యలు లేవంటూ బాధిత కుటుంబాలు మంత్రి తుమ్మల నాగేశ్వరరావును నిలదీశాయి. ప్రభుత్వంపై నమ్మకం లేక స్థానికులు, బంధువులు గజ ఈతగాళ్లను పంపించారు. రాత్రి 10 గంటలకు వర్షం తగ్గుము ఖం పట్టడంతో ఫ్లడ్ లైట్ల వెలుగులో జేసీబీ సాయంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చేరుకోగా అప్పటికే స్థానికుల సహకారంతో వారు బయటపడ్డారని నిర్ధారించి వెనక్కి వచ్చారు. జిల్లా లో ముగ్గురు మంత్రులున్నా ఏం ప్రయో జన మని బాధిత కుటుంబాలు ధ్వజమెత్తాయి.
గజ ఈతగాళ్లే రక్షించారు!
ఖమ్మంలో మున్నేరు వరదలో చిక్కుకున్న మరో 11 మంది బాధితులనూ బంధువులే రక్షించుకున్నారు. కరుణగిరి సాయికృష్ణనగర్ వాటర్ ట్యాంకు వద్ద ఓ ఇల్లు రెండో ఫ్లోర్ వర కూ నీరు చేరింది. తమను రక్షించాలని దివ్యాంగుడు సహా ఐదుగురు పెద్దలు, ఐదుగురు పిల్లలు వేడుకుంటూ ఉదయం వారు పె ట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రభుత్వం స్పందించకపోవడంతో బంధువులు డబ్బులు చెల్లించి వైరా ప్రాంతం నుంచి ముగ్గురు గజ ఈతగాళ్లను రప్పించి బాధితులను బయటకు తీసుకొచ్చారు.
రాళ్లవాగులో ఒకరి గల్లంతు..
మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ మండల శివారు ఈదుల పూసపల్లి రో డ్డులో ఉన్న రాళ్లవాగులో ఆదివారం రాత్రి ఏపీకి చెందిన డీసీఎం వ్యాన్ చిక్కుకుపోయిం ది. ఐదుగురిలో ముగ్గురు వ్యాన్‌ను, మిగతా ఇద్దరు చెట్టును పట్టుకొని ఉన్నారు. వారిలో ఒకరు గల్లంతు కాగా మిగతా నలుగురిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కాపాడారు.