హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): ‘మీ సేవ’లో ప్రభుత్వం మరో 9 సేవలను జోడించింది. ఇన్నాళ్లుగా తహసీల్ కార్యాలయంలో మాన్యువల్‌గా అందుస్తున్న సేవలను ఆన్లైన్లో అందుబాటులోకి తెస్తున్నట్టు సీసీఎల్ఏ కార్యాలయం తెలిపింది.
కొత్తగా.. గ్యాప్ సర్టిఫికెట్, పౌరుల పేరు మార్పు, మైనార్టీ సర్టిఫికెట్, మరోసారి సర్టిఫికెట్ల జారీ (రీ ఇష్యూ), క్రీమిలేయర్, నాన్ క్రీమిలేయర్ సర్టిఫికెట్లు, మార్కెట్ విలువపై సర్టిఫైడ్ కాపీ, పాత రికార్డుల కాపీలు (ఖాస్రా/సెస్సాలా పహాణీ), 1బీ సర్టిఫైడ్ కాపీలు ఆన్లైన్లో మీ సేవ ద్వారా అందజేయనున్నారు.