గంగాధర, డిసెంబర్ 21: పోగొట్టుకున్న తన ఏటీఎం కార్డు బ్లాక్ చేయించుకునేందుకు బ్యాంక్ టోల్ ఫ్రీ నంబర్‌కు బదులు మరో నంబర్‌కు కాల్ చేసి, సైబర్ నేరస్తులకు చిక్కి రూ.9.8 లక్షలు పోగొట్టుకున్న ఘటన జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితుడు కథనం ప్రకా రం.. కొడిమ్యాల మండలానికి చెందిన శ్రీనివాస్‌కు కరీంనగర్ జిల్లా గంగాధర యూనియన్ బ్యాంకులో ఖాతా ఉంది. శ్రీనివాస్ ఇటీవల తన ఏటీఎంకార్డు పోగొట్టుకున్నాడు. ఈ నెల 5న బ్యాంకు కు వెళ్లి కార్డు పోయిందని చెప్పగా.. కార్డు బ్లాక్ చేయించుకుంటేనే కొత్త కార్డు వస్తుందని, అందుకోసం టోల్‌ఫ్రీ నంబర్ 1800222244కు కాల్ చే యాలని సిబ్బంది సూచించారు. 6న శ్రీనివాస్ టోల్‌ఫ్రీ నంబర్ 180022 2244కు బదులు పొరపాటున 800222244కు కాల్చేశాడు. గుర్తు తెలియని వ్యక్తి హిందీలో మాట్లాడి కార్డు బ్లాక్ చేయించేందుకు ఓటీపీ చె ప్పాలని కోరగా, తన మొబైల్‌కు వచ్చిన ఓటీపీని శ్రీనివాస్ చెప్పాడు. దీంతో ఒకసారి రూ.8 లక్షలు, మరోసారి రూ.1.8 లక్షలు శ్రీనివాస్ ఖాతా నుంచి డెబిట్ అయ్యాయి. దీంతో బాధితుడు బ్యాంకుకు వెళ్లి వివరించగా వారి సూచన జగిత్యాల సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.