హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ వార్షిక పరీక్షలకు 9.8లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. మంగళవారం వరకు 9,79,506 మంది విద్యార్థులు ఫీజు చెల్లించారు. వార్షిక పరీక్షలు 2026 ఫిబ్రవరి 25 నుంచి మార్చి 17 వరకు జరుగనున్నాయి.
మాడల్ టీచర్లకు నోషనల్ సర్వీస్ ఉత్తర్వులు
హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : మాడల్ స్కూల్ టీచర్లకు నోషనల్ సర్వీస్, సమాన వేతనం అమలుచేస్తూ విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులు విడుదల చేసింది. ఫలితంగా 1,326 మంది మాడల్ స్కూల్ టీచర్లకు లబ్ధి చేకూరనుండడంతో వారిలో హర్షం వ్యక్తమవుతున్నది.