ప్రతిష్ఠాత్మక జీఆర్టీ జ్యువెలర్స్ సంస్థ మరోసారి అత్యంత విశ్వసనీయమైన లెజెండరీ బ్రాండ్ అవార్డును గెలుచుకున్నది. 1964లో ప్రారంభమైన ఈ సంస్థ.. టైమ్స్ బిజినెస్ అవార్డు అందుకోవడం వరుసగా ఇది ఎనిమిదో సారి. ‘వరుసగా ఎనిమిదో సారి అత్యంత విశ్వసనీయమైన లెజెండరీ బ్రాండ్ అవార్డు పొందడం నిజంగా మేము మొదటి నుంచి సరైన మార్గంలో ఉన్నామని చూపిస్తున్నది’ అని జీఆర్టీ జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్లు జీఆర్ ఆనంద్-అనంత పద్మనాభన్, జీఆర్ రాధాకృష్ణన్ తెలిపారు.