హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): డీఎస్సీ-2008 బాధితులకు ఉద్యోగాలిచ్చే ప్రక్రియ వేగవంతమైంది. అభ్యర్థుల తుది జా బితాను రూపొందించే పనిని పాఠశా ల విద్యాశాఖ చేపట్టింది. ఇందుకు ఉ మ్మడి జిల్లాలవారీగా ఉన్నతాధికారులకు బాధ్యతలు అప్పగించింది. ఈ నెల 8లోపు అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించి, తుది జాబితాను తయారుచేసి పంపాలని పాఠశాల విద్యాశా ఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి ఉత్తర్వుల్లో ఆదేశించారు. 9 ఉమ్మడి జి ల్లాలకు 9 మంది ఉన్నతాధికారుల ను పరిశీలకులుగా నియమించింది.
గ్రూప్-4 ఫలితాలు విడుదల చేయండి
హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): గ్రూప్-4 తుది ఫలితాల కోసం అభ్యర్థులు వినూత్నంగా నిరస న వ్యక్తంచేస్తున్నారు. పరీక్ష జరిగి ఇప్పటికీ 500 రోజులు పూర్తికావొస్తున్నా నియామకాలు పూర్తికాకపోవడంతో అభ్యర్థులు లేఖల(లెటర్ క్యాంపెయి న్) ద్వారా నిరసన వ్యక్తంచేస్తున్నారు. తక్షణమే సెలెక్షన్ లిస్టును విడుదల చేయాలని లేఖ ద్వారా టీజీపీఎస్సీ అధికారులను కోరారు.