ఇంద్రవెల్లి, నవంబర్ 7: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని జడ్పీ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న మసురే వీరేందర్ విద్యుత్తు షాక్‌కు గురయ్యాడు. గురువారం ఫూలాజీ బాబానగర్‌లో గల గ్రౌండ్లో ఆడుకుంటుండగా.. నిర్మాణంలో ఉన్న నూతన భవనంపై వేలాడుతున్న 11 కేవీ విద్యుత్తు వైర్లను పట్టుకోవడంతో షాక్‌కు గురయ్యాడు.
తోటి విద్యార్థులు కర్రలతో కొట్టి వైర్ల నుంచి విద్యార్థిని వేరు చేశారు. తీవ్రగాయాలైన వీరేందర్‌కు ప్రభుత్వ దవాఖానలో ప్రథమ చికిత్స అందించి 108 అంబులెన్స్ లో రిమ్స్‌కు తరలించారు