ఖైరతాబాద్, డిసెంబర్ 11: హైదరాబాద్ యశోద దవాఖానలో 88 ఏండ్ల వృద్ధురాలికి ఆధునిక విధానంలో చికిత్స చేశారు. కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రమోద్‌కుమార్ మాట్లాడుతూ.. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సుమన్‌రెడ్డి బృహద్దమని దెబ్బతిన్నట్టు గుర్తించాం. వయోవృద్ధులకు ఓపెన్ హార్ట్ సర్జరీ చాలా కష్టం. దీంతో ‘ట్రాన్స్ కేథటర్ అయోర్టిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్’ ద్వారా ఎలాంటి కోత లేకుండా వృద్ధురాలికి చికిత్స చేసినట్టు తెలిపారు. ఇలాంటి అరుదైన చికిత్స ఇదే తొలిసారి’ అని పేర్కొన్నారు.