భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ):‘ భద్రాద్రి, ములుగు జిల్లాల పోలీసులు చేపడుతున్న ‘చేయూత’కు ఆకర్షితులైన 86 మంది దళ సభ్యులు.. మల్టీజోన్-1 ఐజీపీ చంద్రశేఖర్‌రెడ్డి ఎదుట లొంగిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హేమచంద్రాపురంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఐజీపీ వివరాలను వెల్లడించారు.
ఇప్పటి వరకు రెండు జిల్లాల్లో వివిధ స్థాయిల్లో పనిచేస్తున్న 224 మంది లొంగిపోయారని వివరించారు. సమావేశంలో భద్రాద్రి ఎస్పీ రోహిత్‌రాజు, ములుగు ఏఎస్పీ శివం, ట్రైనీ ఐపీఎస్ రుత్విక్‌సాయి తదితరులు పాల్గొన్నారు.