హైదరాబాద్, మే 17(నమస్తే తెలంగాణ): లైసెన్స్డ్ సర్వేయర్ల భర్తీ కోసం సుమారు 8,500 మంది దరఖాస్తు చేసుకున్నట్టు తెలిసింది. ప్రభుత్వం కొత్తగా ప్రైవేటు సర్వేయర్లకు శిక్షణ ఇచ్చి లైసెన్స్డ్ సర్వేయర్లుగా నియమించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఆసక్తిగల వారి నుంచి దరఖాస్తులను కోరింది.
దరఖాస్తులకు ఈ నెల 17వ తేదీ (శనివారం) వరకు అవకాశం కల్పించింది. ప్రభుత్వం 5 వేల మంది సర్వేయర్లను మాత్రమే నియమించాలని నిర్ణయించగా.. గడువు నాటికి సుమారు 8,500 మంది దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం.