హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో జరుగనున్న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది. కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ (పట్టభద్రులు, టీచర్స్) నియోజకవర్గాలకు, నల్లగొండ-ఖమ్మం-వరంగల్ (టీచర్స్) నియోజకవర్గానికి ఇప్పటివరకు మొత్తం 85 నామినేషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే 56 నామినేషన్లు దాఖలైనట్లు సీఈవో సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఇందులో కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ (టీచర్స్) స్థానానికి 4, కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ (గ్రాడ్యుయేట్స్) స్థానానికి 36 నామినేషన్లు, నల్లగొండ-ఖమ్మం-వరంగల్(టీచర్స్) స్థానానికి 16 నామినేషన్లు దాఖలైనట్లు వివరించారు. ఈ నెల 10న నామినేషన్ల గడువు ముగియనున్నట్టు తెలిపారు.