హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎక్సైజ్‌శాఖ ఎన్ఫోర్స్మెంట్ విభాగం దూకుడు పెంచింది. మాదకద్రవ్యా ల అక్రమ రవాణా, అక్రమ మద్యం రవాణా, గంజాయి మూలాలను తుదమొట్టించడంలో పైచేయి సాధించింది. తొమ్మిది నెలల కాలం లో 842 కేసులు నమోదుచేసింది. 1,445 మందిని అరెస్టుచేసింది. 364 వాహనాలను సీజ్చేసింది. ప్రత్యేకంగా సెప్టెంబర్ మాసంలోనే 43 కేసులు నమోదుకాగా, 134 మంది ని అరెస్టుచేయడమే కాకుండా 715 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జనవరి నుంచి సెప్టెంబర్ వరకు ఎన్ఫోర్స్మెంట్ విభాగం పనితీరుపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి బుధవారం సమీక్షించారు. మాదకద్రవ్యాల కట్టడికి కృషిచేసిన అధికారులను అభినందించారు.