మొయిన్బాద్, ఫిబ్రవరి 17: ఇటీవల రంగారెడ్డి జిల్లాలోని ఫామ్‌హౌజ్‌లో కోడిపందాలు ఆడుతుండగా పోలీసులు దాడిచేసిన విషయం తెలిసిందే. ఆ దాడిలో స్వాధీనం చేసుకున్న పందెం కోళ్లను సోమవారం రాజేంద్రనగర్ న్యాయస్థానంలో న్యాయమూర్తి సమక్షంలో వేలంవేశారు. 84 పందెం కోళ్లను వేలం వేయగా రూ.16.60లక్షల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. పందెం కోళ్లు అత్యంత ఖరీదైనవి కావడంతో ఆ బ్రీడ్ మరొకరికి దక్కనివ్వవద్దని పందెంకోళ్ల రాయుళ్లు సిండికేట్‌గా ఏర్పడి దక్కించుకున్నారు. ఈ కోళ్ల విలువ రూ.3 కోట్లు ఉంటుందని ఏపీ నుంచి వచ్చిన పందెం రాయుళ్లు పేర్కొన్నారు.