జిన్నారం, మే 22 : ఐదు నెలలు గా న్యాయం కోసం తిరుగుతున్నా పరిష్కారం దొరుకడం లేదని 82 ఏండ్ల రిటైర్డ్ ఎంఈవో సంగారెడ్డి జిల్లా జిన్నారంలోని తహసీల్ కార్యాలయం ఎదుట శుక్రవారం నిరసనకు దిగారు. జిన్నారం మండలం శివానగర్‌కు చెందిన 82 ఏండ్ల రవిశంకర్‌కు 172 సర్వేనంబర్‌లో 14 గుంటల వ్యవసాయ భూమి ఉన్నది. అది ఇతర వ్యక్తుల పేరుతో తప్పుగా నమోదైంది. ప్రస్తుతం రవిశంకర్ అమెరికా (గ్రీన్ కార్డు హోల్డర్)లో నివాసం ఉంటున్నాడు. ఐదు నెలల క్రితం ఇం డియాకు వచ్చి అన్ని పత్రాలను రెవె న్యూ అధికారులకు అందించి తన పేరుపై చేర్చాలని విజ్ఞప్తి చేశారు. మరో నెలలో అమెరికాకు వెళ్లాల్సి ఉందని, సమస్య పరిష్కరించాలని వేడుకున్నాడు. అధికారులు స్పందించకపోవడంతో నిరసనకు దిగారు. రవిశంకర్‌కు న్యాయం చేయాలని జడ్పీ మాజీ వైస్ చైర్మన్, బీఆర్ఎస్ నేత ప్రభాకర్ డిమాండ్ చేశారు.