హుజూరాబాద్, జూన్ 7 : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని శాలపల్లి-ఇందిరానగర్ గ్రామంలో ఎలాంటి అనుమతిలేకుండా వరి విత్తనాలను సంచుల్లో ప్యాక్ చేస్తుండగా శుక్రవారం వ్యవసాయశాఖ అధికారులు పట్టుకుని సీజ్ చేశారు.
ఏడీఏ సునీత తెలిపిన వివరాల ప్రకారం.. లింగయ్య అనే వ్యక్తి ఇందిరానగర్‌లోని ఓ ఇంటిని అద్దెకు తీసుకొని అనుమతి లేకుండా వరి విత్తనాలను ప్యాక్ చేస్తున్నాడు. ఇతర ప్రాంతాల నుంచి పీఆర్-105 అనే రకం వరి విత్తనాలను దిగుమతి చేసుకొని శాంభవి అనే పేరుపై 20 కిలోల చొప్పున సంచుల్లో నింపుతున్నాడు. శుక్రవారం సంచుల్లో నింపి ఎగుమతి చేసేందుకు రంగం సిద్ధం చేశాడు. సమాచారం మేరకు దాడి చేసి 80 క్వింటాళ్ల విత్తనాలను పట్టుకున్నట్టు ఏడీఏ సునీత తెలిపారు.