హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ) : విశాఖ స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం స్టీల్ ప్లాంట్లోని స్టీల్ మెటల్ లిక్విడ్ ల్యాడిల్ పేలడంతో ఉక్కుద్రవం లీకై ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 9 మంది దుర్మరణం పాలయ్యారు.
మరికొంత మంది కార్మికులు లోపల చిక్కుకున్నట్టు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నది. ప్రమాదంపై ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.