హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ (పట్టణ పరిపాలనా శాఖ) కింద గురువారం నిధులను విడుదల చేసింది. ఈ మేరకు తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీయూఎఫ్ఎఫ్ఐడీసీ) సహాయం కింద 2025-26 బడ్జెట్ అంచనాల నుంచి రూ.770 కోట్ల విడుదలకు ప్రభుత్వం పరిపాలనా అనుమతిని మంజూరు చేసింది.
అలాగే రాజ్‌భవన్, బీఆర్కే భవన్ నిర్వహణ ఖర్చులకుగాను రూ.1.37కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఇందులో రాజ్‌భవన్‌కు రూ.75లక్షలు, బీఆర్కే భవన్‌కు రూ. 62లక్షలు విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి అధికారిక నివాసం అద్దెల కింద రూ.11.78లక్షలు విడుదలచేస్తూ ఉత్తర్వులిచ్చింది. పరిశ్రమలశాఖలోని 13మంది అధికారులకు సెల్ఫోన్లు సమకూర్చేందుకు రూ.2.8లక్షలకు ఉత్తర్వులిచ్చింది.