హైదరాబాద్, ఆగస్టు 1(నమస్తే తెలంగాణ) : ఆపరేషన్ ముస్కాన్-11లో భాగంగా పోలీసులు, పలు విభాగాల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి 7,678మంది(బాలురు-7,149, బాలికలు-529) చిన్నారులను రెస్క్యూ చేసినట్టు ఉమెన్ సేఫ్టీ వింగ్ డీజీ చారుసిన్హా తెలిపారు.
జూలై 1 నుంచి 31 నిర్వహించిన కార్యక్రమంలో 6,718 మంది బాలకార్మికులే ఉన్నట్టు చెప్పారు. 357 మంది వీధిబాలలు, 42 మంది భిక్షాటన చేసేవారు, ఇద్దరు వెట్టిబానిసలు, ఇతర కార్మాగారాల్లో పనిచేసేవారు 559 మంది ఉన్నట్టు వివరించారు. 1,713 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి 1,718 మంది నిందితులను అరెస్టు చేసినట్టు వెల్లడించారు.