హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర హైకోర్టు చరిత్రలో జస్టిస్ సూరేపల్లి నంద ఒకే రోజు అత్యధిక తీర్పులను వెలువరించి రికార్డు సృష్టించారు. వేసవి సెలవులు ముగిసిన తర్వాత సోమవారం హైకోర్టు పునఃప్రారంభమైంది. దీంతో ఆమె వేర్వేరు కేసుల్లో 76 తీర్పులను వెలువరించి రికార్డు నెలకొల్పారు.