గట్టు/పెద్దకొత్తపల్లి, ఆగస్టు 23 : కర్ణాటకకు అక్రమంగా తరలుతున్న 76 బస్తాల ఎరువులను అధికారులు పట్టుకున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్ నుంచి కర్ణాటకకు తరలిస్తుండగా శనివారం బలిగేర చెక్‌పోస్ట్ వద్ద స్వాధీనం చేసుకున్నట్టు మార్కెటింగ్ అధికారి దశరథరామిరెడ్డి తెలిపారు.
నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలోని అరుణోదయ సీడ్స్ ఫర్టిలైజర్ షాపును 15 రోజులపాటు సీజ్ చేసినట్టు జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంత్‌రావు తెలిపారు. శనివారం సదరు దుకాణాన్ని తనిఖీ చేయగా రిజిస్టర్లో ఎరువుల బస్తాల వివరాలు నమోదు చేయకుండా అధిక ధరలకు విక్రయించినట్టు పేర్కొన్నారు.