హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల కోసం టీసీఎస్, సీఐఐ ఫౌండేషన్లు 17 వేల ఎన్95 మాస్కులను అందజేశాయి. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా టీసీఎస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఏపీ తెలంగాణ టెక్నాలజీ బిజినెస్ యూనిట్ గ్లోబల్ హెడ్ వీ రాజన్న శుక్రవారం గన్‌ఫౌండ్రీలోని విద్యాశాఖ మంత్రి కార్యాలయంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డికి మాస్కులను అందజేశారు. మాస్కులు అందజేసిన సంస్థల ప్రతినిధులను సబితారెడ్డి అభినందించారు.