Group-1 preliminary exam | తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 1019 కేంద్రాల్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష నిర్వహించింది. పరీక్ష కేంద్రంలోకి ఉదయం 8.30 గంటల నుంచి 10.15 గంటల వరకు పరీక్ష కేంద్రాల్లోకి అభ్యర్థులను అనుమతించగా.. ఆ తర్వాత అభ్యర్థులకు అనుమతి ఇవ్వలేదు. 503 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయగా.. 3.80లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షకు 2,86,051 మంది అభ్యర్థులు హాజరైనట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. ఎనిమిది రోజుల్లో ఓఎంఆర్ షీట్ల స్కానింగ్ ప్రక్రియ పూర్తి చేస్తామని, స్కానింగ్ ప్రక్రియ పూర్తయ్యాక ప్రాథమిక కీని విడుదల చేయనున్నట్లు వివరించింది.