హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): లా కోర్సుల్లో 75% హాజరు నిబంధన ఉండాల్సిందేనని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ హాజరు నుంచి మినహాయింపు ఇస్తే విద్యార్థులకే తీవ్ర నష్టం కలుగుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు క్లాసులకు రాకపోతే భవిష్యత్తులో న్యాయవాదులుగా ఎలా రాణిస్తారని ప్రశ్నించారు. న్యాయ విద్య లో హాజరు నిబంధనలపై శనివారం జాతీయస్థాయిలో మేధోమధనం జరిగింది. ‘స్టూడెంట్ అటెండెన్స్ పాలసీ సవాళ్లు-పరిష్కారాలు’ అంశంపై జాతీయ స్థాయిలో వెబినార్ నిర్వహించారు. ఈ వెబ్నార్కు బాలకిష్టారెడ్డి హాజరై మాట్లాడారు.