హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గత నెల 27న ప్రారంభమైన ప్రత్యేక లోక్ అదాలత్ శనివారం విజయవంతంగా ముగిసిందని, తెలంగాణ హైకోర్టు, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ (టీఎస్ఎల్ఎస్ఏ) సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పోలీసు విభాగానికి సంబంధించిన 74,782 కేసులు పరిషారమయ్యాయని సీఐడీ డీజీ చారుసిన్హా ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. వాటిలో 14,642 ఎఫ్ఐఆర్లు, 154 విప త్తు నిర్వహణ కేసులు, 23,400 ఈ-పెట్టీ కేసులు, 31,189 మోటర్ వాహన చట్టం కేసులు, 5,397 సైబర్ క్రైమ్ కేసులు ఉన్నాయని వివరించారు. న్యాయ చరిత్రలో ఈ లోక్ అదాలత్ మైలురాయిగా నిలిచిందని పేర్కొంటూ.. అ ందుకు సహకరించిన పోలీసులకు, న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు. కేసుల రాజీకి కృషి చేసిన టాప్-5 పోలీస్ యూనిట్లలో హైదరాబాద్, రామగుండం, నల్లగొం డ, ఖమ్మం, వరంగల్ యూనిట్లు ఉన్నట్టు ఆమె తెలిపారు.