హైదరాబాద్, ఫిబ్రవరి 4(నమస్తే తెలంగాణ) : జేఎన్టీయూ హైదరాబాద్లో 2024-25 సంవత్సరానికి సంబంధించి 73 గోల్డ్ మెడల్స్ ఇవ్వనున్నారు. ఈ గోల్డ్ మెడల్స్ ఈ నెల 7న(శనివారం) జేఎన్టీయూ ఆడిటోరియంలో నిర్వహించనున్న 14వ స్నాతకోత్సవంలో విద్యార్థులకు అందించనున్నారు. వర్సిటీకి సంబంధించి 7 గోల్డ్ మెడల్స్, అటానమస్ కాన్స్టియంట్ కాలేజీలకు 5, నాన్ అటానమస్ కాలేజీలకు 9, యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజీలకు 21, ఎండోమెంట్ పథకం కింద 31 మందికి ఈ బంగారు పతకాలు ఇవ్వనున్నట్టు అధికారులు ప్రకటించారు. స్నాతకోత్సవంలో భాగంగా జేఎన్టీయూ నుంచి బీటెక్, బీఫార్మసీ, ఎంటెక్, ఎంఫార్మసీ ఇతర కోర్సులు కలిపి దాదాపు 82 వేల మందికి పట్టాలు ప్రదానం చేయనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. సంబంధించిన పూర్తి ఏర్పాట్లు చేశామని =పేర్కొన్నారు.