హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమం కొనసాగుతున్నది. మొత్తం 3,38, 26,448 మంది ఓటర్లకు సంబంధించి ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ 100 % పూర్తయినట్టు సీఈవో కార్యాలయం వెల్లడించింది. శనివారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఇప్పటివరకు రాష్ట్రస్థాయిలో 2,49, 47964 ఫారాల డిజిటైజేషన్ (73. 75%) పూర్తయింది. యాదాద్రి భువనగిరి 92.74శాతం, జనగామ 89.53 శాతం, మెదక్ 88.86 శాతంతో వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. హైదరాబాద్ 50.73 శాతం, మేడ్చల్ మలాజిగిరి 54.89 శాతం, రంగారెడ్డి 59.21 శాతంతో చివరి మూడు స్థానాల్లో ఉన్నాయి.