హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ) : పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. 73.35 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 71.05శాతం, బాలికలు 77.08శాతం పాసయ్యారు. 38,741 మంది పరీక్షలు రాయగా.. 28,415 మంది ఉత్తీర్ణత సాధించారు.
బాలురతో పోల్చితే బాలికలు 6.03 శాతం అధికంగా పాసయ్యారు. జనగామ జిల్లా వందశాతం ఉత్తీర్ణత నమోదుచేయగా, సంగారెడ్డి జిల్లాలో తక్కువగా 55.90శాతం నమోదైంది. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం జూలై 7లోగా దరఖాస్తు చేసుకోవాలని పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు.