హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ) : టీఎస్ లాసెట్‌లో 72.66 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మూడేండ్ల లా కోర్సులో 25,510 (73.27%) మంది, ఐదేండ్ల లా కోర్సులో 5,478 (65.12%) మంది, పీజీఎల్ సెట్ లో 3,270 (84.65%) మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గురువారం టీఎస్ లాసెట్, టీఎస్ పీజీఎల్ సెట్ ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా లాసెట్ కన్వీనర్ బి విజయలక్ష్మి మాట్లాడుతూ మూడేండ్ల లా కోర్సుకు 27,993 మంది, ఐదేండ్ల లా కోర్సుకు 8,412 మంది, పీజీఎల్ సెట్‌కు 3,863 మంది విద్యార్థులు పరీక్ష రాశారని వివరించారు. లా సెట్‌కు ఐదుగురు ట్రాన్స్ జెండర్లు దరఖాస్తు చేసుకోగా, పరీక్షకు హాజరైన నలుగురు పాసయ్యారని తెలిపారు. కార్యక్రమంలో ఓయూ రిజిస్టర్ లక్ష్మీనారాయణ, ప్రొఫెసర్ జీబీ రెడ్డి, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు వీ వెంకటరమణ, ఎస్కే మహమూద్, కార్యదర్శి శ్రీరామ్ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
మూడేళ్ల లా కోర్సులో హైదరాబాద్‌కు చెందిన పీజీఎం అంబేదర్కు 97.49 మార్కులతో మొదటి ర్యాంకు, గచ్చిబౌలికి చెందిన ప్రత్యూష్ సరస 96.65 మార్కులతో రెండో ర్యాంకు, ఖమ్మం జిల్లా సింగరేణికి చెందిన తల్లూరి నరేశ్ 95.74 మారులతో మూడో ర్యాంకు సాధించారు. ఐదేండ్ల లా కోర్సులో మియాపూర్‌కు చెందిన శ్రీరాం బొడ్డు 87 మారులతో మొదటి ర్యాంకు, కామారెడ్డికి చెందిన పిప్పిరి శెట్టి దినేశ్ 87 మారులతో రెండో ర్యాంకు, మలాజిగిరికి చెందిన ఆర్పీ విజయనందిని 84 మారులతో మూడో ర్యాంకు పొందారు. పీజీఎల్ సెట్లో సికింద్రాబాద్‌కు చెందిన పెరి బాలసాయి విష్ణువర్ధన్ 76 మారులతో మొదటి ర్యాంకు, ఏపీ కృష్ణాజిల్లాకు చెందిన అభినీతి జాసన్ 70 మారులతో రెండో ర్యాంకు, హైదరాబాద్‌కు చెందిన నిమన్ సిన్హా 67 మారులతో మూడో ర్యాంక్ సాధించారు.