హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 6.50 కోట్ల పనిదినాల్లో.. ఇప్పటికే 4.53 కోట్ల పనిదినాలు పూర్తిచేసినట్టు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. కేటాయించిన మొత్తం పనిదినాల్లో 70 శాతం లక్ష్యాన్ని రెండు నెలల్లోనే చేరుకున్నట్టు తెలిపారు. సగటున ఒకో కూలీకి రోజువారి వేతనం రూ.250.75 లభిస్తున్నదని, రూ.307 దక్కేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.