హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీలో సమ్మె జరిగే సూచనలు మెం డుగా కనిపిస్తున్నాయి. ఆర్టీసీ కార్మిక సం ఘాలు ఇచ్చిన సమ్మె నోటీసులకు యాజమా న్యం నుంచి ఎలాంటి స్పందనలేకపోవడంతో సోమవారం ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని లేబర్ ఆఫీసులో 7 కార్మిక సంఘాలతో జేఏసీ సమ్మె సన్నాహక సమావేశం నిర్వహించనున్నది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి జేఏసీ నేతలు సమాచారమిచ్చారు. దీంతో కార్మిక సంఘాలు సమ్మె తేదీ ప్రకటించే అవకాశమున్నది.
ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సమ్మెకు వెనుకాడబోమని ఇప్పటికే ఆర్టీసీ యూనియన్లు.. ఇటీవల ఆర్టీసీ యాజమాన్యానికి, లేబర్ కమిషనర్‌కు నోటీసులు ఇచ్చాయి. అయితే చర్చలకు ఆహ్వానించాల్సిన ఆర్టీసీ యాజమాన్యం తాత్సారం చేస్తుండటంతో సమ్మె అనివార్యమనే వాదనలు వినిపిస్తున్నాయి. తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె జరిగితే.. దానికి ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న (ఈయూ), జేఏసీ వైస్ చైర్మన్ మారంరెడ్డి థామస్‌రెడ్డి (టీఎంయూ) తెలిపారు. కాగా, సమ్మెతో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉండటంతో.. తమ సమ్మెకు మహిళాసంఘాలు, ప్రజాసంఘాలు, అన్ని యూనియన్లు కలిసిరావాలని వారు కోరుతున్నారు.