హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): విశాలంగా తరగతి గదు లు.. భౌతికదూరం పాటించేలా కూర్చునే వెసులుబాటు.. పక్కాగా కొవిడ్ నిబంధనల అమలుతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు జోరందుకున్నది. ప్రత్యక్ష తరగతులు ప్రారంభమై శుక్రవారంతో నెల రోజు లు పూర్తయింది. శుక్రవా రం ప్రభుత్వ బడుల్లో 67.87 శాతం హాజరు నమోదైంది. అదే సమయంలో ప్రైవేటు స్కూళ్ల లో 39.54 శాతం, ఎయిడెడ్ పాఠశాలల్లో 38.86 శాతం హాజరు రికార్డయిం ది. సెప్టెంబర్ 1న ప్రత్యక్ష తరగతులు ప్రారంభం కాగా.. ఆ రోజు 21.77 శాతం వి ద్యార్థులే హాజరయ్యారు. రాష్ట్రంలో కొవిడ్ కేసులు పెద్దగా నమోదుకాకపోవడంతో వివిధ స్కూళ్ల లో విద్యార్థుల హాజరు ప్రస్తుతం 50.68 శాతానికి చేరుకున్నది. ఇందులో సర్కారు బడులకు 67 శాతానికిపైగా విద్యార్థులు హాజరవుతున్నారు.