హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్తగా 6వేల ఎలక్ట్రిక్ వాహన చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ దిశగా తెలంగాణ రెడ్కో కసరత్తు వేగవంతం చేసింది. విద్యుత్తు వాహనాల వాడకం పెరుగుతున్న నేపథ్యంలో చార్జింగ్ స్టేషన్ల సంఖ్యను పెంచడం అనివార్యమైంది. మరోవైపు ఈవీ చార్జింగ్ స్టేషన్ల నుంచి ఇది వరకు వసూలు చేసే ఫిక్స్డ్ చార్జీలను ఇటీవలే మినహాయించారు.