హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ) : ఎస్సెస్సీ ఫలితాల్లో భాష్యం విద్యార్థులు విజయభేరి మోగించినట్లు విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్ భాష్యం సాకేత్రామ్ తెలిపారు. పీ శృతి, ఆర్ గుణసాయి, శరణ్రెడ్డి 600మార్కులకు 595 సాధించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచినట్టు తెలిపారు.
వీఎస్ శరజ్ఞ 594, కేఎల్డీవీ అనురాధ 594, కే హనీషా 594, డీ గగనహంస 593, యువీ లిఖిత్ 593, ఆరోహిశర్మ 593 మార్కులు సాధించగా, 580కి పైగా మార్కులతో 203 మంది, 570కి పైగా 433 మంది, 550కి పైగా 974 మంది, 500కు పైగా మార్కులను 1,934 మంది సాధించినట్టు సాకేత్రామ్ వివరించారు.